తూర్పు రొంపి దొడ్ల గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ వైద్య సేవలు

83చూసినవారు
తూర్పు రొంపి దొడ్ల గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ వైద్య సేవలు
వరికుంటపాడు మండలం తూర్పు రొంపి దొడ్ల గ్రామంలో సోమవారం ఫ్యామిలీ డాక్టర్ వైద్య సేవల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారిణి ఆయేషా 35 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేశారు. దీర్ఘకాలిక రోగులు ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్త వహించాలని ఆయేషా సూచించారు. షుగర్, బీపీ ఉన్నవాళ్లు పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలన్నారు. ప్రతినెల అందించే వైద్య సేవలను ఉపయోగించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్