దివ్యాంగులు మేము దివ్యాంగులమని నిరుత్సాహపడకుండా అన్ని రంగాల్లో రాణించడం ఎంతో సంతోషకరమని కొండాపురం మండల ఎంఈఓ రవికుమార్ తెలిపారు. దివ్యాంగుల దినోత్సవాన్ని పరిష్కరించుకొని కొండాపురం పట్టణంలోని భవిత కేంద్రంలో మంగళవారం దినోత్సవాన్ని నిర్వహించారు. ఎంఈఓ మాట్లాడుతూ మానసిక లోపం ఉన్న పిల్లల తల్లిదండ్రులు ఈ భవిత కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దివ్యాంగులకు ధైర్యం చెబుతూ అండగా నిలవాలన్నారు.