భూ సమస్యల పరిష్కార వేదికే రెవెన్యూ సదస్సు అని, ఎలాంటి భూ సమస్యలైనా ఈ సదస్సులో పాల్గొని అర్జీ రూపాన అధికారులకు అందజేయాలని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు. బుధవారం రెవిన్యూ మండల అధికారులతో జలదంకి సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. అర్జీదారులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్మాత్మకంగా చేపట్టిన ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.