వరికుంటపాడు మండలంలోని జడదేవి గ్రామంలో రైతులు జోరుగా వరి నాటుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు, బావులు నిండడంతో పాటు భూగర్భ జలాలు అభివృద్ధి చెందాయి. దీంతో వరినాట్లు వేస్తున్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు పుష్కలంగా పడడంతో రైతులు వివిధ రకాల పంటలు వేయడంలో నిమగ్నమయ్యారు. కాగా ఈరోజు, రేపు నుంచి తుఫాన్ ఉందని హెచ్చరిక రావడంతో రైతులకు నీటి కొరత ఉండే అవకాశం ఏమాత్రం లేదు.