నీటి సమస్యపై స్పందించిన బ్రాహ్మణ క్రాక సర్పంచ్

84చూసినవారు
నీటి సమస్యపై స్పందించిన బ్రాహ్మణ క్రాక సర్పంచ్
జలదంకి మండలం బ్రాహ్మణ క్రాక బీసీ కాలనీలోని త్రాగునీటి బోర్ లో మోటార్ కాలిపోయి ఇరుక్కుపోవడంతో గత రెండు రోజులుగా నీళ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని కొందరు సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన మంగళవారం ఇరుక్కుపోయిన బోర్ ను బయటకు తీసి రిపేర్ చేయించి నీటి సరఫరాను యధావిధిగా కొనసాగించారు. దీంతో నీటి సమస్య తీరిపోయిందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్