ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని వరికుంటపాడు మండలంలో గల విరువూరు గ్రామ సమీపంలోని ప్రధాన రహదారి గుంతలతో అధ్వానంగా ఉంది. అసలే గుంతలు ఉండడం అందులోను ఇటీవల కురిసిన వర్షాలకు నీరు నిలబడడంతో అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చిన్న చిన్న ప్రమాదాలు సైతం జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చొరవ తీసుకొని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరారు.