వింజమూరు మండలం బొమ్మరాజు చెరువులోని టిడిపి కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన వరికుంటపాడు వాసి ఆవుల అరుణమ్మ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ని మర్యాదపూర్వకంగా కలసి, శాలువాతో సన్మానించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే సురేష్ సహకారంతోనే రాష్ట్రస్థాయి పదవి లభించినదని, ఎల్లవేళలా పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తానని ఆమె అన్నారు.