వరికుంటపాడు: 38 మందికి వైద్య పరీక్షలు

75చూసినవారు
వరికుంటపాడు: 38 మందికి వైద్య పరీక్షలు
నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని రామదేవులపాడు గ్రామంలో మండల వైద్య అధికారిని కరిష్మా ఫ్యామిలీ డాక్టర్ వైద్య సేవలను మంగళవారం అందించారు. ఆమె 38 మంది రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందించారు. మధ్యాహ్నం శిబిరానికి రాలేని వారి ఇళ్లకు వెళ్లి పరీక్షించి చికిత్సలు అందించారు. సీజనల్ వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అందించే వైద్య సేవలను ఉపయోగించు కోవాలన్నారు.

సంబంధిత పోస్ట్