వింజమూరు లోని ఎస్వీఎస్ కళ్యాణ మండపంలో మంగళవారం ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆత్మీయ, కార్యకర్తల అభినందన సభను విజయవంతం చేయాలని వింజమూరు టిడిపి మాజీ మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని 8 మండలాల వికలాంగుల శ్రేయస్సు కోరి 146 ట్రైసైకిళ్లు ఎంపీ వేమిరెడ్డి - ఎమ్మెల్యే ప్రశాంతి దంపతులతోపాటు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా పంపిణీ జరుగుతుందన్నారు.