AP: పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానం ఉందంటూ ఇటీవల మాజీ ఎంపీ హర్షకుమార్ వీడియో రిలీజ్ చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు మాజీ ఎంపీ హర్షకుమార్‌కు నోటీసులు ఇచ్చారు. ఆయన మృతికి సంబంధించి ఏవైనా ఆధారాలు ఉంటే తీసుకుని విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ మేరకు రాజమండ్రి నార్త్ జోన్ డీఎస్పీ నోటీసులు జారీ చేశారు. కాగా, పాస్టర్ ప్రవీణ్ మృతిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.