AP: అత్యాచారం, హత్యకు గురైన బాధితుల పేర్లు బహిర్గతం చేసిన కేసులో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు అందించారు. గురువారం సాయంత్రం అనంతపురంలోని మాధవ్ ఇంటికి చేరుకుని నోటీసులు జారీ చేశారు. మార్చి 5వ తేదీన 10 గంటలకు విజయవాడలోని సూర్యారావుపేటలోని సైబర్ క్రైమ్ పీఎస్‌కు విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు.