ఏపీలో పింఛను పంపిణీలో వెసులుబాటు

74చూసినవారు
ఏపీలో పింఛను పంపిణీలో వెసులుబాటు
AP: ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రతి నెలా ఒకటో తారీఖున అందిస్తున్న ఫింఛన్ల పంపిణీలో కూటమి ప్రభుత్వం కొత్త వెసులుబాటు తీసుకొచ్చింది. తెల్లవారుజామున పంపిణీ చేయాలనే నిబంధనలను తొలగించింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు లబ్ధిదారులు కూడా ఇబ్బంది పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి 7 గంటలకు పంపిణీ ప్రారంభించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. అలాగే లబ్ధిదారుల ఇంటి నుంచి 300 మీ దూరంలోనే పంపిణీ చేయాలని పేర్కొంది.

సంబంధిత పోస్ట్