రాష్ట్రంలో రబీ పంటలకు డిసెంబర్ 15వ తేదీలోపు బీమా చేయించాలని వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషాను ఆదేశించారు. గురువారం ఆయన విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంటల బీమాపై సమీక్షించారు. రాయలసీమలో పంటలకు డిసెంబర్ 15వ తేదీలోపు బీమా చేయించే ప్రక్రియను ముగించాలన్నారు. కౌలు రైతులకు త్వరగా సీసీఆర్సీ కార్డులను మంజూరు చేయించాలని ఆదేశించారు.