పూర్తైన వినగడప కట్టలేరు తాత్కాలిక మార్గం

51చూసినవారు
వినగడప - విజయవాడ వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న వినగడప కట్టలేరు తాత్కాలిక రహదారి పూర్తయింది. స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఈ డైవర్షన్ పనులు త్వరగా పూర్తి చేసామని ఎస్సీ సెల్ అధ్యక్షులు నారాయణ బుధవారం తెలిపారు. గంపలగూడెం మండలానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారు మరియు విజయవాడకు వెళ్లేవారు ప్రతి ఒక్కరు ప్రయాణాలు సాగించవచ్చని ఎన్డీఏ కూటమి మండల టిడిపి పార్టీ శ్రేణులు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్