టిడిపి సీనియర్ నాయకుడు మృతి

59చూసినవారు
టిడిపి సీనియర్ నాయకుడు మృతి
విసన్నపేట మండలం చండ్రుపట్ల పరిధి పెద్దతండ గ్రామపంచాయతీకి చెందిన భుక్య శ్రీరాములు శుక్రవారం ఉదయం నాలుగు గంటలకు మృతి చెందారు. శ్రీరాములు మాజీ గ్రామ సర్పంచిగా మరియు ఎంపీటీసీగా పనిచేశారని గ్రామస్తులు తెలిపారు. అనారోగ్య కారణంగా మృతి చెందటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎన్డీఏ కూటమి, వివిధ పార్టీ నాయకులు, అభిమానులు భౌతికకాయాన్ని సందర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సంబంధిత పోస్ట్