సాంఘిక సంస్కర్తగా మహాత్మ జ్యోతిరావు ఫూలే చేసిన సేవలు చాలా గొప్పవని, మహిళల విద్య, సామాజిక న్యాయం కోసం ఆయన ఎనలేని కృషి చేశారని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు అన్నారు.
మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ డిల్లీరావు జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూల మాలలు అలంకరించి ఘన నివాళులు అర్పించారు.