కూటమి గెలుపు కోసం కృషి చేయాలి - నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద బాబు

84చూసినవారు
కూటమి గెలుపు కోసం కృషి చేయాలి - నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద బాబు
రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని,చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఎన్డీఏ కూటమి నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డా.చదలవాడ అరవింద బాబు పిలుపునిచ్చారు.నియోజకవర్గ పరిశీలకులు మన్నవ మోహన కృష్ణ ఆధ్వర్యంలో క్లస్టర్ సమావేశం నిర్వహించారు.గతంలో రాష్ట్రం అభివృద్ధిలో దేశంతో పోటీ పడేదనీ జగన్ రెడ్డి వచ్చాక అభివృద్ధి పోయి అరాచకం వైపు దివాలా తీసిందన్నారు.విద్య,ఉద్యోగం,ఉపాధి,వ్యవసాయం,మహిళా సంక్షేమంలో జగన్ రెడ్డి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడన్నారు.మళ్లీ రాష్ట్రం అభివృద్ది బాటలో నడవాలంటే మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు.అందుకోసం ప్రతి కార్యకర్త పని చేయాలని,మరో పది రోజులు కష్టబడితే రాష్ట్రం మళ్లీ గదిలోకి వస్తుందని డా.చదలవాడ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్