నాగార్జునసాగర్ కు భారీగా వరద నీరు

57చూసినవారు
శ్రీశైలం నుండి మాచర్ల మండలం నాగార్జున సాగర్‌ రిజర్వాయర్‌కు 5 లక్షల క్యూసెక్కుల భారీ వరద ఉధృతి కొనసాగుతుండడంతో ప్రాజెక్టు 26 గేట్లను ఎత్తి వరద నీటిని సోమవారం సాయంత్రం దిగువకు విడుదల చేశారు. 20 గేట్లను 15 అడుగులు, 6 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 5, 03, 268 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్‌ డ్యామ్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు కాగా ప్రస్తుతం 586. 80 అడుగులవద్ద నీరు నిల్వ వుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్