కారంపూడి వీరుల ఆరాధన ఉత్సవాల సందర్భంగా బుధవారం వీరాచారవంతులు చేస్తున్న విన్యాసాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పల్నాటి యుద్ధంలో అసువులు బాసిన వీరుల వారసులు తెలంగాణ ప్రజల ప్రాంతాలలో నివసిస్తూ ఉన్నారు. యుద్ధంలో కోల్పోయిన తమ పూర్వికులను జ్ఞప్తికి తెచ్చుకుంటూ వారు యుద్ధ సమయంలో వాడిన ఆయుధాలను చేతబడి వారు చేస్తున్న విన్యాసాలు ఆనాడు జరిగిన యుద్ధ ఘటనను కళ్ళకు కట్టినట్లుగా ప్రదర్శిస్తున్నారు.