మాచర్లలోని ఎస్కేబీఆర్ డిగ్రీ కళాశాలను గుంటూరు ఆర్జీడి డా. కళావతి బుధవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. కళాశాలలో నిధుల దుర్వినియోగం, కళాశాల నిర్వహణ, వసతులు, కంప్యూటర్ ఫ్యాకల్టీ కొరత పలు అంశాలపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులతో సమీక్షించినట్లు తెలిపారు. సంబంధిత నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు.