నేటి నుంచి వీర్ల అంకాలమ్మ బోనాల ఉత్సవాలు

73చూసినవారు
నేటి నుంచి వీర్ల అంకాలమ్మ బోనాల ఉత్సవాలు
కారంపూడిలో కొలువై ఉన్న పల్నాటి వీర్ల అంకాలమ్మ తల్లి శుక్రవారం సాయంత్రం గ్రామోత్సవానికి బయలు దేరనుంది. ఏడాదిలో శ్రావణమాసం శుక్రవారం అమ్మవారిని బయటకు తీస్తారు. ఉదయం ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం భక్తులు కుంకుమ బండ్లతో తరలివచ్చి అమ్మ వారికి బోనాలు చెల్లిస్తారు. అలాగే పోలేరమ్మ తల్లి, పాతపాటేశ్వరమ్మ, పోతురాజు, బొడ్రాయిలకు కూడా పూజలు చేస్తారు. సాయంత్రం అంకాలమ్మ అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహిస్తారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్