పులిచింతల నుంచి తగ్గిన నీటి ఉధృతి

58చూసినవారు
అచ్చంపేట మండలం పులిచింతల ప్రాజెక్టు నుంచి నీటి ప్రవాహ ఉధృతి తగ్గింది. సోమవారం ప్రాజెక్టు నుంచి 21 గేట్ల ద్వారా 4. 50లక్షల క్యూసెక్కులు వదలగా మంగళవారం సాయంత్రానికి తొమ్మిది గేట్ల నుంచి 2.94 లక్షల క్యూసెక్కులు మాత్రమే దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 41. 73 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇది 173 అడుగుల లోతుకు సమానం.

సంబంధిత పోస్ట్