అమరావతి మండల కేంద్రంలోని ముస్లిం ఏరియా ప్రాథమిక పాఠశాలలో వరద నీరు ముంచెత్తింది. నాలుగు అడుగుల లోతు నీటి ప్రవాహం పాఠశాలలోకి ప్రవేశించింది. గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయమయ్యాయి. మంగళవారం స్కూలుకు సెలవు కావడంతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోయింది. వరద నీరు వెళ్లేందుకు ప్రొక్లైన్ సాయంతో అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.