కోమటిపల్లిలో మహిళా కోలాటం ప్రదర్శన

68చూసినవారు
కోమటిపల్లిలో మహిళా కోలాటం ప్రదర్శన
బ్బిలి మండలం కోమటిపల్లి గ్రామంలో ఆదివారం రాముడు వలస గ్రామానికి చెందిన శ్రీ రాధాకృష్ణ మహిళా కోలాటం బృందం సభ్యులతో కోలాటం ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా తూర్పు భాగవత కళాకారులు, సామాజిక కార్యకర్త బొంతల కోటి శంకర్రావు మాట్లాడుతూ.. మన కళల రక్షణ మన బాధ్యత అన్నారు. ఈ గ్రామంలో ప్రతి వారం ఒక సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం టీం లీడర్ శ్రీ నీలబోను లక్ష్మణ్, మిగతా సభ్యులను సత్కరించడం జరిగింది.

సంబంధిత పోస్ట్