మెంటాడ మండలం మెంటాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక రాష్ట్రమంత్రి గుమ్మిడి సంధ్యారాణి పైన అనవసర విమర్శలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ మెంటాడ మండల అధ్యక్షుడు చలుమూరి వెంకట్రావు అన్నారు. సోమవారం సాయంత్రం పార్టీ నాయకులతో కలసి మాట్లాడారు. మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర సాలూరులో మంత్రి సంధ్యారాణిపై విమర్శలు చేయడం సరికాదన్నారు.