మంచినీరు ఇచ్చి ఆదుకోవాలి

74చూసినవారు
మంచినీరు ఇచ్చి కొమరాడ మండలంలోని జల గిరిజన గ్రామాన్ని ఆదుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కే. సాంబమూర్తి శనివారం డిమాండ్ చేశారు. మహిళలతో కలిసి ఖాళీ బిందెలతో నిరసన తెలియజేశారు. గిరిజనులు మంచినీరు లేక కలుషితమైన నీరు తాగి అనారోగ్యాలకు గురౌతున్నారని అన్నారు. చేతి పంపు బోరులో నీరు 10 బిందెలు తొడితే బురద నీరు వస్తోందని ఆరోపించారు. 40 రోజులుగా మంచి నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్