గర్భిణిని డోలిలో మోసుకుంటూ ఆస్పత్రికి చేర్చిన గ్రామస్తులు

68చూసినవారు
రహదారుల సౌకర్యం లేక గిరిజన ప్రాంత ప్రజలకు అత్యవసర సమయాల్లో డోలీ మోతలు తప్పడం లేదు. కొమరాడ మండలం పూడేసు పంచాయతీ గుమ్మడంగికి రహదారి సౌకర్యం లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి చెందిన మెల్లక బందాయమ్మకు గురువారం నొప్పులు రావడంతో గ్రామస్థులు డోలీలో మోసుకుంటూ ఆసుపత్రికి తరలించారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్