తోటపల్లి దేవస్థానం భూమి కబ్జా

51చూసినవారు
తోటపల్లి దేవస్థానం భూమి కబ్జా
గరుగుబిల్లి మండలం, తోటపల్లిలో దేవస్థానం భూమి కబ్జా చేశారు. ఆలయ ప్రాంగణంలోని భూమిలో రాత్రికి రాత్రి కంచె వేయడంతో అధికారులు అవాక్కాయ్యారు. 30 ఏళ్ల క్రితం తమ బంధువులు ఈ ప్రాంతంలో ఉండేవారని, అందుకే స్థలం తమకే చెందుతుందని నెల్లిమర్ల ప్రాంతానికి చెందిన నాని, మరికొందరు ఆలయానికి వచ్చారు. విషయం కాస్తా ఎమ్మెల్యే జగదీశ్వరి దృష్టికి వెళ్లడంతో స్పందించిన రెవెన్యూ అధికారులు శనివారం కంచెలు తొలగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్