
విజయనగరం: ఈవిఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్
ఈవిఎం గోదాములను విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మంగళవారం తనిఖీ చేశారు. షట్టర్లకు వేసిన సీళ్లను, సిసి కెమేరాలను పరిశీలించారు. సిసి కెమేరా ఫీడ్ ను ప్రతీ 15 రోజులకోసారి భద్రపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎస్. శ్రీనివాసమూర్తి, ఆర్డిఓ డి. కీర్తి, తాహసీల్దార్ సుదర్శన్, ఎన్నికల సూపరింటిండెంట్ భాస్కర్ రావు , ఇతర సిబ్బంది పాల్గొన్నారు.