
భోగాపురం: సాగునీటి సంఘం పాలకవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే
భోగాపురం మండలం ముంజేరు నీటి సంఘం ఉపాధ్యక్షులు పతివాడ ప్రసాద్ తదితర పాలక వర్గాన్ని, నెల్లిమర్ల మండలం మొయిద కొత్త, పాత చెరువు సాగు నీటి వినియోగదారుల సంఘం పాలకవర్గాన్ని ఎమ్మెల్యే లోకం నాగ మాధవి శనివారం నెల్లిమర్లలోని తన కార్యాలయంలో అభినందించారు. చెరువులు అభివృద్ధికి, రైతులు సంక్షేమానికి కట్టుబడి పని చేయాలని సూచించారు. జనసేన నాయకులు యడ్ల గోవిందరావు, కరిమజ్జి గోవిందరావు, అట్టాడ త్రినాధ్ తదితరులు పాల్గొన్నారు.