నెల్లిమర్ల: పింఛన్లను పంపిణీ చేసిన ఇన్‌ఛార్జ్‌ మంత్రి అనిత

78చూసినవారు
నెల్లిమర్లలో ఎన్. టి. ఆర్. భరోసా పింఛన్లను జిల్లా ఇన్‌ఛార్జ్‌, రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనిత శనివారం పంపిణీ చేశారు. దివ్యంగులైన బైరెడ్డి సూరిబాబుకు రూ. 6వేలు, జామి సన్యాసి రావుకు వృద్ధ్యాప్య పింఛన్ పాత బకాయితో కలిపి 8 వేల రూపాయలను, వి. లక్ష్మీకి రూ. 4వేల నగదును మంత్రి చేతుల మీదుగా అందజేశారు. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక రోజు ముందే పింఛన్ పంపిణీ చేయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్