పాలకొండ నియోజకవర్గంలో మంగళవారం తీవ్ర వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. పాలకొండలో 47. 9, సీతంపేటలో 47. 3, వీరఘట్టంలో 48. 6, భామినిలో 47. 5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రేపు తీవ్ర వడగాలులు వీస్తాయని హెచ్చరిస్తూ ఏపీఎస్డిఎంఏ ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.