పాలకొండ మండలం అంపిలి, అన్నవరం తదితర గ్రామాలలో శుక్రవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పాలకొండ డివిజనల్ ఈఈ టీ. మూర్తి గురువారం తెలిపారు. పాలకొండ సబ్ స్టేషన్ 11 కేవీ సంకిలి విద్యుత్ లైన్ నిర్వహణ పనులు చేపట్టడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించాలని కోరారు.