మన్యం జిల్లా కేంద్రంలో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. సౌందర్య వెనుక భాగం గణేష్ నగర్ కాలనీ ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుకకాలనీలో ఎమ్మెల్యే విజయ్ పర్యటించారు. దశబ్ద కాలంగా గణేష్ నగర్ కి ముంపు సమస్య ఉందని దీనికి శాశ్వత పరిష్కారం చూపించండి కాలువల విస్తరణ కొత్త కాలువల ఏర్పాటు చేయడంతో పాటు వరద నీరు వచ్చే ప్రాంతాలను పరిశీలించి నివారణ చర్యలు తీసుకుంటామన్నారు.