ఎక్కడైనా సరే మంచి సమాజ నిర్మాణం ఉపాధ్యాయులతోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. మంగళవారం పుత్తూరు ఉపాధ్యాయులు కోట వెంకటరమణ పదవీ విరమణ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు విద్యార్థులను తీర్చిదిద్ది వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేది ఉపాధ్యాయులేనని ఎమ్మెల్యే అన్నారు. విద్యాభివృద్ధి కోసం వెంకటరమణ ఎంతో కృషి చేశారని ఆయన సేవలు భవిష్యత్ తరానికి ఆదర్శమని ఎమ్మెల్యే కొనియాడారు.