సంక్రాంతి సంబరాల కార్యక్రమాలు ఔరా అనిపించాయి. సంస్కృతీ, సాంప్రదాయ కళా నృత్యాల ప్రదర్శనలు అందరినీ అలరించాయి. గిరిజన, పౌరాణిక, ఏకపాత్రాభినయం, జానపద, కూచిపూడి, థింసా బృంద నృత్యాల కళా స్ఫూర్తి వెల్లివిరిసింది. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంక్రాంతి సంబరాల వేడుకలను శనివారం సందడిగా ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ దంపతులతో పాటు ఇతర శాఖల జిల్లా అధికారులు ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు.