పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. శుక్రవారం జెడ్పి కార్యాలయంలో జెడ్పి సర్వసభ్య సమావేశం జరుగుతున్న నేపధ్యంలో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. సమావేశంలోఉన్న మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, సంధ్యారాణి విద్యార్థుల నుంచి వినతి పత్రం స్వీకరించారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ తో మాట్లాడి నిధులు విడుదలకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.