విద్యార్థులు సీజనల్ జ్వరాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి

79చూసినవారు
విద్యార్థులు సీజనల్ జ్వరాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి
విద్యార్థులు సీజనల్ జ్వరాలకు గురికాకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
డాక్టర్ కె. విజయపార్వతి ఆదేశించారు. ఈ మేరకు రావికోన, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల ఆరోగ్య సమస్యల నమోదు రికార్డుల నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ మధ్య కాలంలో జ్వర లక్షణాలతో ఎంత మంది ఉన్నారని ఆరా తీశారు. విద్యార్థులతో మాట్లాడి చేతుల పరిశుభ్రత, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్