సార్వత్రిక టీకా కార్యక్రమం ప్రమాణాలను పకడ్బందీగా అమలు చేయాలని మన్యం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి(డిఐఓ)డాక్టర్ ఎమ్. నారాయణరావు స్పష్టం చేశారు. ఈ మేరకు వైద్యాదికారులకు, సిహెచ్సి, ప్రాంతీయ ఆసుపత్రి వైద్యులకు గిరిమిత్ర సమావేశ మందిరంలో రీఓరియంటేషన్ శిక్షణా కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ శిక్షణను డబ్ల్యుహెచ్ఓ సర్వలెన్స్ వైద్యాధికారి డా. జాన్ జూడ్ జాషువా పవర్ ప్రజెంటేషన్ ద్వారా ఇవ్వడం జరిగిందన్నారు.