మెంటాడ మండల కేంద్రంలో భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని సిపిఎం నాయకుడు రాకోటి రాములు అన్నారు. శుక్రవారం మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాకోటి రాములు మాట్లాడుతూ దేశం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన దేశ ఆర్థిక శాఖ మంత్రిగా, ప్రధానమంత్రిగాను పలు సంస్కరణలు అమలు చేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపారని కొనియాడారు.