ప్రభుత్వ, ప్రైవేటు ఐటిఐలలో మిగిలి ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా ప్రభుత్వ ఐటిఐల కన్వీనర్ ప్రిన్సిపాల్ రవికుమార్ బుధవారం ఓ ప్రకటనలో కోరారు. ఈనెల 26వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలన్నారు. 28న ప్రభుత్వ ఐఐటీ 30న ప్రైవేటు ఐటీఐలకు అభ్యర్థులు సర్టిఫికెట్లతోపాటు హాజరై అర్హులైన అభ్యర్థులు ఐటిఐలో చేరవచ్చు అన్నారు.