సాలూరు: 27వ వార్డులో టిడిపి సభ్యత్వ నమోదు
సాలూరు పట్టణం 27వ వార్డులో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన పట్టణ టిడిపి అధ్యక్షులు నిమ్మాది చిట్టి మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సభ్యత నమోదు పొంది ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని పొందాలని అన్నారు. అధిష్టానం విధించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని ఇన్ చార్జ్ లను కోరారు.