ఎస్. కోట గ్రామ పంచాయతీలో గ్రీన్ అంబాసిడర్లుగా పనిచేస్తున్న కార్మికులకు వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని కోరుతూ గ్రీన్ అంబాసిడర్లు గురువారం జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు వబ్బిన సన్యాసినాయుడు ఆధ్వర్యంలో పంచాయతీ ఈఓ లక్ష్మికి వినతి పత్రం అందజేశారు. గ్రీన్ అంబాసిడర్లకు సుమారు 19 నెలల నుండి వేతనాలు అందలేదని ఆయన తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.