కొత్తవలస మండల కేంద్రంలో శుక్రవారం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కూడలి వరకు సాయంత్రం వాహనాలు బారులు తీరాయి. కాంప్లెక్స్ నుండి కూడలికి సుమారు అర్ధగంట పట్టిందని ఆవేదన వ్యక్తం చేసారు. ట్రాఫిక్ నియంత్రణకు తగినంత పోలీసు సిబ్బంది జంక్షన్ లో లేకపోవడంవలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాహనదారులు వాపోయారు. సాయంత్రం పూట తగినంత ప్రత్యేక సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు.