స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ తమ క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ కార్యక్రమంలో, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. మంత్రితో బాటు ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు పూసపాటి అదితి గజపతిరాజు, లోకం నాగమాధవి, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, జెసి ఎస్. సేతు మాధవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.