ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ''పండుగలు, సంస్కృతి సంప్రదాయాలు, కళలు.. జాతిని సజీవంగా నిలుపుతాయి. మన ముంగిళ్లకు వచ్చిన 'ఉగాది' తెలుగువారి వారసత్వపు పండుగ, విశ్వావసు అనే గంధర్వుడు పేరుతో వచ్చిన ఈ ఉగాది పండుగ తరుణాన ప్రజలందరికీ శుభాకాంక్షలు. తెలుగు లోగిళ్ళను సిరిసంపదలతో పచ్చగా ఉంచాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను'' అని పేర్కొన్నారు.