AP: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కళల్లో అత్యుత్తమ కృషి చేసిన వారికి కళారత్న, ఉగాది పురస్కారాలు ఇస్తుంది. ఈ పురస్కారాలతో పాటు రూ.50 వేల నగదును కూడా అందిస్తారు. వీటిని 1999 నుంచి ఆనవాయితీగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ముఖ్యంగా సాహిత్యం, సంగీతం, నాట్యం, చిత్రలేఖనం, శిల్పకళ, జానపద, గిరిజన కళల్లో చేసిన కృషికి ప్రభుత్వంతో పాటు రాష్ట్ర సాంస్కృతిక మండలి సంయుక్తంగా ఈ అవార్డులను అందిస్తున్నాయి. వీటిని సీఎం చేతుల మీదుగా అందిస్తారు