విశాఖ ప్రేమోన్మాదిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

73చూసినవారు
విశాఖ ప్రేమోన్మాదిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
AP: విశాఖపట్నంలోని మధురవాడలో నవీన్ అనే ప్రేమోన్మాది దీపిక, ఆమె తల్లి లక్ష్మి పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో లక్ష్మి మృతి చెందగా.. దీపికకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇప్పటికే ఈ ఘటనపై రాష్ట్ర సీఎం చంద్రబాబు, మంత్రి అనిత స్పందించారు. దీంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి శ్రీకాకుళం జిల్లా బూర్జిలో నిందితుడు నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్