విజయవాడ-గన్నవరం మార్గంలో పోలీసుల ఆంక్షలు

52చూసినవారు
విజయవాడ-గన్నవరం మార్గంలో పోలీసుల ఆంక్షలు
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు విజయవాడలోకి వాహనాలు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. విజయవాడ-గన్నవరం మార్గంలో అడుగడుగునా ఆంక్షలు విధించారు. ఆంక్షలతో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఇబ్బందులు పడుతున్నారు. కనకదుర్గ వారధిపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. దాంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

సంబంధిత పోస్ట్