దర్శి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో సంక్రాంతి సంబరాలలో భాగంగా ఏర్పాటు చేసిన గొట్టిపాటి, నారపుశెట్టి మెగా క్రికెట్ టోర్నమెంట్ టిడిపి నాయకులు కడియాల లలిత సాగర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులు, యువతకు క్రికెట్ పోటీలు నిర్వహించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. గెలుపోవటములను సమానంగా తీసుకోవాలన్నారు.